EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

15/02/2012

ఆశ

నల్లబడ్డ ఈ ఆకాశంలో
ఉరుమునై ఉరిమి
మెరుపునై మెరిసి
వాన చుక్కనై నేల రాలాలని ఉంది..
నేలరాల్చుకున్న కలలను
దోసిలిపట్టి పైకి లేపి
వాటికి స్వేచ్చారెక్కలు తొడిగి
ఎగురవేయాలని ఉంది..
నేలవాలిన కొమ్మల శిరస్సులను
నిటారుగా పైకి నిలిపి
చిగురుల మొలకలు వేయించాలని ఉంది..

2 comments:

  1. భలే ఆశ:-) బాగుంది!

    ReplyDelete
  2. నేలరాల్చుకున్న కలలను
    దోసిలిపట్టి పైకి లేపి
    వాటికి స్వేచ్చారెక్కలు తొడిగి
    ఎగురవేయాలని ఉంది..
    ఆశకి అక్షర రూపం చక్కగా ఉంది!

    ReplyDelete

Comment on Telgu poem