పచ్చని పైరుల మైదానాలు
పరుగులెత్తే లేగ దూడల విన్యాసాలు
పిల్ల కాల్వలలో పిల్లల ఈదులాటలు
వీధి వెంట ఆప్యాయంగా పలకరింపులు
పల్లెలో ఎప్పుడూ ఉత్సాహమే
రావి చెట్టు క్రింది రచ్చ బండ
మర్యాద రామన్నలా తీర్పు చెబుతుంది
ఎవ్వరికి ఏమైనా నేనున్నానని
ఓదార్పునిస్తుంది ..
అక్క, అన్న అంటూ అందరితో
బంధుత్వం కలుపుతోంది
పురుడుకైనా, చావుకైనా
ప్రతి గుండె కదులుతుంది
ప్రతి గడపా కదులుతుంది
భజన మందిరంలో పాటగా
అందరిని కలుపుతుంది
ఉట్టి కొట్టమని కుర్రకారుని ఉత్తేజపరుస్తుంది
ముగ్గుల గొబ్బెమ్మలుగా ముస్తాబవుతుంది
పల్లెలో పంట పండితే రోజూ సంక్రాంతే ..
ఏ ఇంటిలో పెళ్లి అయినా తోరణాలు కడుతుంది
పల్లె అమ్మలా ఎప్పటికి మరచిపోదు
పల్లె తిరునాళ్ళు ఈ జీవితం మరచిపోదు !!
కరణం లుగేంద్ర పిళ్ళై
చాలా బాగుందండి. కానీ ఇప్పుడు పల్లెటూళ్ళ రూపు రేఖలు,స్వరూప స్వభావాల తోటి మనుషుల మనస్తత్వాలలో కూడా చాలా మార్పులొచ్చాయి అనుకొంటున్నాను.
ReplyDeleteYes vachayi pallelu okkappudu vunnatu eppudu levy chalamarayi Kavitha Chala BHAGUNDHI elage enka rayalani korukuntunnaanu thanks
DeleteNice
ReplyDelete