08/05/2013
చెణుకులు
రగలిన హృదయమేమిటి
రాజీగీతం పాడుతోంది
ప్యాక్షనిజం నివురు
గప్పుకుంది...
***
మానభంగానికి
ఆడదయితే చాలనే ఘటనలు
విలువలకు విలువ లేకుండా
పోయింది
***
టి.వి రిమోట్ కోసం
ఆత్మహత్యచేసుకుంటున్నయువత
బతకడమంటే తెలియకుండా
పోయింది
***
అవినీతికి పచ్చజెండా
ఓటరే ఊపేస్తుంటే
మిగిలేదేమిటి
ఎన్నికలంటే సంతలా
మారిపోయింది.
***
సారం లేని కూర ఎంతైతే నేమి
బ్లాక్ బస్టర్లు తెగ
దీసేస్తున్నారట
డామిట్ సినిమాల కథ అడ్డం
తిరుగుతోంది.. 30.4.2013
మరీచకలు
కటిక చీకటిలోనూ
వెన్నెల వాన కురుస్తోంది
ఆమె నవ్వింది కాబోలు..
***
కొండ పెరిగిపోతూ వుంది
ఎంత ఎత్తని ఎక్కగలం
కోరికలు ఎవరెస్టులయితే..
***
నీకు నాకు మధ్య
పచ్చని నోటు నిలుచోంది
స్నేహం అంటే వ్యాపారమే
***
ఎదురు చూసి చూసి
కళ్ళకు కాయలు కాశాయి
అప్పుకోసం కోటి తిప్పలు
***
గుడ్డి కన్ను
మూస్తే ఎంత తీస్తే ఎంత
కరెంటు లేని రాత్రిలో
***
మండు టెండలో
మరీచకలు
స్వేదం అమ్ముడుబోతోంది 29.4.13
ఒకే గదిలో వేళ్ళ మైళ్ళ దూరం
మన ఇద్దరి మధ్య
మౌనం పెను అగాధం పెరుగుతూ
మాటల వంతెన కడుదామనుకొని
పలకరించబోతే నిర్ధాక్షణ్యంగా కూల్చేస్తూన్నావు
మన ఇద్దరి మధ్య
అహం పొరలు కమ్మి ఎత్తిపొడుపుల యుధ్దం
ఎందుకులే తగ్గిపోదామనుకుని సారీ అంటే
రాజీకొచ్చావా సిగ్గులేదా అంటూ ఎగతాలి చేస్తున్నావు..
మన ఇద్దరి మధ్య
ఒకే గదిలోనే వేల మైళ్ళ దూరం
గత జ్ఞాపకాలనైనా నెమరేసుకుందామంటే
చీత్కారాలతో గుండెలో చితిమంటలు రగిలిస్తున్నావు
మన ఇద్దరి మధ్య
పచ్చని దాంపత్యం చిద్రమవుతుంటే
మన కలలకు మనమే కాలరాయడమెందుకనంటే
ఏం నేను లేకుండా బతకలేవా అని ఎద్దేవా చేస్తున్నావు
మనం ఇద్దరి మధ్య
చిగురించిన చిన్నారుల భవిష్యతేంటి
నీకు నచ్చేలా నేను మారుతాను
పొరలు తొలగించి నీకళ్ళతో చూడవా ప్రియా
నీకోసమే బతికే నేను కనిపిస్తాను
చెప్పుడు మాటలు వదలిపెట్టి
రావా..
అపార్థాల అడ్డుగోడలు కూలదోసి
అనురాగాల జీవితాన్ని పండించుకుందాం
అనుబంధాల బంధాల్ని బతికించుకుందాం 25.4.13
అపార్థాల అడ్డుగోడలు కూలదోసి
అనురాగాల జీవితాన్ని పండించుకుందాం
అనుబంధాల బంధాల్ని బతికించుకుందాం 25.4.13
నేటి నేతల భారతం
లేలేత మొగ్గలపై ఆఘాయిత్యాలు
నిత్యం పతాక శీర్షికల్లో తిష్టవేస్తాయి
ప్రెస్ మీట్ లకే పరిమితమవుతూ
ఖండిస్తున్నపేపర్ పులులు
ఆకలి ప్రేగుల ఆర్తనాదాలు వినబడదు
బడుగు జీవుల భాధలు కనబడదు
సభలలో మైకు ముందు మాత్రం
నీతులు వల్లే వేస్తారు.. ప్రశ్నలై పోరాటాలు
చేస్తారు..
జనం ఐక్యంగా వుంటే చూడలేరు
కులం పేరుతోనో ,మతం పేరుతో నో
వారి మధ్య సరిహద్దు రేఖలు గీస్తారు
వర్గాలుగా, ప్రాంతాలుగా విడగొట్టి
నిప్పుల కంచెలు వేస్తారు.
అన్నీ ఉత్తిత్తివే
ఆర్బాటాల, ప్రగల్బాల వీరంగం చేసి
చీకటి ఒప్పందాలకు లాలూచీ పడి
మౌనంగా నో కామెంట్ అంటూ వుండిపోతారు
నిఖార్సయిన వాడెవడూ లేడు
దోచుకోవడం ,దాచుకోవడం నేటి విదూరనీతి కదా
నేతిబీరకాయలోని నేతి చందమై
ప్రపంచంలోని పెద్ద ప్రజాస్వామ్యం
ఓటుకు ఇంత సీటుకు ఇంత అని
మార్కెట్లో అమ్ముడవుతున్న దృశ్యం
అయినా ఎవడూ ప్రశ్నించడు
గాంధీ చెప్పిన మూడు కోతుల
సూక్తులు నేర్చుకున్నారేమో
ఇకనైనా మేలుకోవాలి నవ యువ భారతం
లేకుంటే బలవుతోంది భావి భారతం 19.4.13
సఖీ
మనసు కిటికీ రెక్కలు
మూసే లోపు
జమ్మంటూ
నీ ఆలోచనల సుడిగాలి ...
కలల బతికీడుస్తూ
ఇలా ఎన్నాళ్ళు ప్రియా..
ఒంటరితనం నింపిన
నిటూర్పుల ఖాళీని
నవ్వుల నయాగారాలతో
నింపవా సఖీ..
19.4.13
ద్విముఖి
తెల్లని కాగితంపై
అద్దిన మరకల్లా
నీవు ఇచ్చిన హామీలు
ఇంకా ఇంకిపోలేదు..
అన్నీ ఉచితమేనా
అనుచితం కాకపోతే
అన్నీంటికీ రాయితీలేనా
అది మనది కాకపోతే
ఒకరి స్వేదం ఇంకోకరికి
పన్నీరవుతున్న వేళ
శ్రమ సంస్కృతికి
చరమగీతం పాడుతున్నావా
పాడు పథకాలు వెలుగిపోతుంటే
పాడికడుతున్నావని తెలుసుకోలేకపోయాం
ఎముకలేని చేయని అంటుంటే
ఏమార్చుతున్నావని గ్రహించలేకపోయాం
ఓట్లకోసం ఎరవేసే నక్క జిత్తులు నీవి
తెరవెనుకు తంతంగాలు నడిపే కుటిల నీతి నీది
ధవళ వస్త్రాల మాటున దోపిడి కప్పేశావు
నవ్వులు మోముతోనే నట్టింట ముంచేశావు 18.4.13
Subscribe to:
Posts (Atom)

