EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

08/12/2011

మృగంతో జీవనం






ఏమి జరగనట్టు
నవ్వులు అలా పులుముకొని
అలా బయటికి వెళ్లిపోతావ్
ఇంట్లో పగిలిన వస్తువుల మధ్య
నిట్టూర్తున్న హృదయపు విలాపం
నీకు వినపడవు !
అయినా నీవు ముసుగేసుకొని
నడుస్తూనే వుంటావ్ ..
కరచాలనంగానో , కబుర్ల టీ కొట్టులోనో
నిన్ను పోగొట్టుకొని
లాగి పారేసిన సిగరెట్టు కంపై కుమిలిపోతావ్ ...
నిన్ను ఎదిరించిన ప్రశ్నకు
కసిగా నీవు ఏదో చేయాలని
బెదిరించాలని, బెదరగోట్టాలని
రెండు పెగ్గుల మతై
గుమ్మం ముందు వాలిపోతావ్
అమ్మలా నిన్ను చేరదీసి
నీవు కక్కిన బూతుల వాంతులను
సహనంతో శుబ్రం చేస్తుంది
తాను పస్తులుండి
నీకు కడుపారా అన్నం పెట్టి
రెప్ప వేయని రాత్రవుతుంది ..
నీవు గోర్లతో రక్కిన గాట్ల నుండి
ఉదయం రక్తమై స్రవిస్తుంది
నీలో మృగం మళ్ళే లేస్తుంది .!!
తర తరాలుగా ఆమె బతుకు
పులి నోట చిక్కిన లేడి అవుతుంది ..

6 comments:

  1. అద్భుతం! మాటలు రావడం లేదు!

    ReplyDelete
  2. పులి నోట చిక్కిన "లేడి"....

    ReplyDelete
  3. చివరి నాలుగు లైన్లు చాలా బాగారాసారు

    ReplyDelete
  4. చాలా బాగుంది

    ReplyDelete

Comment on Telgu poem