EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

09/07/2012

నాకు ఇంకేమి కావాలి

 
 
పిల్లగాలి తెమ్మరగా
ఇలా వచ్చి అలా వెళ్ళావు...

ప్రియతమా చూడు
నీవు తెచ్చిన స్నేహ సుగంధం
ఇంకా పరిమళిస్తూనే ఉంది
సంతోషం రెక్కలు మొలిచి
ఊహల్లో విహరిస్తూ ఉంటే
నాకు దూరమై
నింగిని తాకిన కలల చుక్కలను
నేలకు రాల్చి తగులబెట్టావు..

అయినా నీ ధ్యాస
నాలో పెరుగుతూనే ఉంది
ఉఛ్వాస నిచ్వాసలే నీవైనప్పుడు
నాకు ఇంకేం కావాలి
నీవు తోడు రాకపోయినా
నీవు మిగిల్చిన
తడి ఆరని జ్ఞాపకాల ఊతం చాలు
ఈ జీవితం మోడుబారకుండా గడిపేందుకు
నీవు వెదజెల్లిన
వెన్నెల వెలుగుల జిగేలు చాలు
ఈ చీకటి పయనంలో చింతలేకుండా ఉండేందుకు

3 comments:

  1. Visit http://bookforyou1nly.blogspot.in/

    for books

    ReplyDelete
  2. చాలా బాగుందండీ...:)
    చక్కగా వ్రాసారు.బోమ్మ కుడా చాలా బాగుంది..

    ReplyDelete
  3. నీవు వెదజెల్లిన
    వెన్నెల వెలుగుల జిగేలు చాలు
    ఈ చీకటి పయనంలో చింతలేకుండా ఉండేందుకు...
    nice feel...
    @sri

    ReplyDelete

Comment on Telgu poem