కంటి
రెప్పల చూరు క్రింద
వేలాడుతున్న
జ్ఞాపకాలను
ఎలా
తుడిచేయగలం
గోకుల్ చాటో,
లుంబినినో
మక్కా
మసీదో
రక్తం
పారిన యేరుల జాడ
ఇంకా
తడారలేదు
నగరం
నెత్తురోడ్డుతోంది
భాగ్యనగరం
కాదిది
భాధల నగరం
ఏ అపరాత్రో
అర్థరాత్రో
చావు కబురు
చల్లగా వస్తుంది
స్క్రోలింగులనిండా
అదే
రక్తపు
మరకలతో
మాంసపు
ముద్దలుగా
మానవత్వం
ఏ పగ ఉందో
ఏమో
ముష్కరుల
పంజాకు
అభం శుభం
ఎరుగని
వారు
బలవుతుంటే
మనం
సాధించింది
శూన్యమనిపిస్తోంది
రండి శాంతి
కాముకుల్లారా
నిరసిద్దాం
నినదిద్దాం
గొంతులు
సవరించుకొని
ఉగ్రవాదంపై
ఉక్కుపాదం మోపుదాం
భారతావనిపై
శాంతిని పరిరిక్షించుదాం.. 22.2.13
No comments:
Post a Comment
Comment on Telgu poem