గుప్పెడు కూడా లేని గుండె
నీకు ఓ ఆలయం అయింది.
కళ్ళు నీ కలల కాణాచిగా మరి
స్వప్న సౌందర్యాన్ని వర్ణిస్తున్నాయి
తలపులు నీ మైమరపులో మునిగిపోయి
తన్మయత్వంతో తేలియాడుతున్నాయి ..
నా జీవన కోటకు రాణిగా మారిన నిన్ను చూసి
నాలోని ఆణువణువూ సైనికుడిగా మారి
నీకు రక్షణ గా వుండాలని పోరుతున్నాయి
నిన్న నీవు నవ్విన్న నవ్వుకు
నా మనసు సెలయేరు పరవళ్ళు తొక్కుతోంది
నీవు చూసిన వాలు చూపుకు
నిండు ఎడారిలో సైతం వసంతం విరబూస్తోంది!!
No comments:
Post a Comment
Comment on Telgu poem