EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

07/09/2011

ఉగ్రవాదం ఉసురు తీయాలి !!

దమన కాండకు అద్దుహదుపు లేకుండా పోతోంది 
అమాయకుల పై బాంబులతో దాడి చేసి  
ప్రజలను బయబ్రాంతులను చేస్తే ఏమొస్తుంది ?
ముంబై మార్కెట్లో తెగబడినా రక్త దాహం తీరలేదేమో 
ఢిల్లీ హైకోర్ట్ ముందర రాక్షస కాండకు ఒడిగట్టారు ..
ప్రాణం తీయడమంటే వారికో ఆటగా మారిపోయింది 
మానవత్వం మంటగలసి 
మృగమై సాటి మనిషులనే చంపితే జిహాద్ వస్తుందా 
మనుషుల ప్రాణాలు తీయమని ఏ మతం చెప్పదు..
ఉగ్రవాదం , ఉన్మాదమై ఊరేగుతుంటే చూస్తూ వుండాలా ?
నేరం నిరూపణ అయిన సంవత్సరాల తరబడి 
కోట్లు ఖర్చు పెట్టి వారిని కాపాడే ప్రభుత్వమా మేలుకో 
కావలసింది సానుభూతులు , పరామర్శలు కాదు 
బతకడానికి ధైర్య మనే నమ్మకం ..
దౌత్య నీతికొసం దానవులను మన్నిచకండి
 ఉగ్రవాదపు ఉసురు తీసి శాంతికి పట్టాభిషేకం చేయండి !!
                                                                               కరణం లుగేంద్ర పిళ్ళై



ముసలవ్వ


తనువేమో ఎముకల గూడు
తపనేమో కడలి కెరటాల హోరు
తనేమో పిల్లల పలకరింపునకు మొహం వాచింది
తనయిలెమో ఆస్తుల కోసమే
ప్రాణం పోవాలని ఎదురుచూస్తున్నారు .!!

06/09/2011

ప్రసవ వేదన

తల్లి గర్భంలో
శిశువు
నవమాసాలు ఉంటేనే
ప్రాణమూ... నిండు రూపమూ ..
దేనికి తొందర ?
ఆలోచనల మదిలో
కవిత మగ్గితేనే
దానికొక అర్థమూ ...పరమార్థమూ
నొప్పిలేకుండా జననమే లేనప్పుడు
ఇక జీవితం ఉంటుందా ?
ఉలి దెబ్బలు తగిలితేనే
శిల శిల్పంగా మారేది ..
బండల నడుమ పరుగులేట్టితేనే
ప్రవాహపు వేగం పెరిగేది ..
వేదనలు చుట్టుముట్టిన్నప్పుడే
ఓర్పు విలువ తెలిసోచేది
మనిషి నైజం బయటపడేది ..!!

                              కరణం లుగేంద్ర పిళ్ళై



పవిత్ర యజ్ఞం ..

Art by M. Ganesh Kumar
అవినీతి అందలమెక్కి
పిశాచమై పట్టి పీడిస్తుంటే .
దేశ ప్రగతి నీరుగారి పోతోంది
ఇంతింత కాదు జగమంతా
అల్లుకుపోతున్న వైనంతో
సమాజం తల్లడిల్లిపోతోంది
ఎవరికీ ఏమీ పట్టని నేడు
అన్న హజారే గళం విప్పాడు
లోక్పాల్ బిల్లుకై ప్రభుత్వ మేడలు వంచాడు
అవినీతిని అంతమొందిచాలంటే
అది ప్రతి ఇంటా మొదలు కావలసిన పవిత్ర  యజ్ఞం ..
విలువల పాదులు  తీసి
ప్రతి బిడ్డకు గోరు ముద్దలతో
అందించవలసిన పవిత్ర కార్యం ..
యుద్ధం మొదలైంది ..సన్నధమౌదాం !
అంతం కాదిది ఆరంభమే ..
వ్యక్తి మారినప్పుడే వ్యవస్థ మారేది ..
రండి సోదరులార మారి చూపుదము
రాబోయే తరాలకు మార్గదర్శాకులవుదము !!

                             కరణం లుగేంద్ర పిళ్ళై

05/09/2011

ఆఫీసుల్లో అడబతుకు ..!




Art by M. Ganesh Kumar
  చూపులు వళ్ళంతా తడుముతుంటే
తేళ్ళు ,జేర్రెలు ప్రాకుతున్నట్టు వుంటుంది
సూటు బూటు వేసుకున్న మగ మృగాలు
అడవి జంతువులకన్నా క్రూరమైనవి .
చిన్న కష్టానికే మేమున్నామంటూ
ఓదార్చే చేతుల చేష్టల్లో
కోర్కెల కాలనాగుల బుసలు కొడతాయి ..
డబల్ మీనింగ్ డైలాగ్లు డైనమేట్లై
హృదయాన్ని గాయపరుస్తుంటే
గోల చేయడమో , గేలి చేయడమో
వెంటపడి వేటాడటమో చేస్తూనే వుంటారు..
అవసరం వున్నా లేకున్నా మాటలు కలుపుతారు
తడుముతూ స్పర్స తోనే మానసిక వ్యభిచారం చేస్తారు ..
సెల్ ఫోన్ లో నీలి చిత్రాల సందేశాలు
అర్థం చేసుకోలేని అత్తా మామ ..
భాదను మరింత భాధ పెట్టె భర్త సాడిజం తోడవుతుంది ..
ఇంకేం అందరూ పుండుపై కారం రాస్తారు ..
చుట్టూ అందరు వున్నా ఒంటరిగా అడవిలో వున్నటు ఉంటోంది ..
చుట్టలైనా , స్నేహితులైన , కట్టుకున్న వాడిన
చెప్పుకోలేని మౌన సంఘర్షణ మాది ..
మానం కాపాడుకోవలసిన నిందలు పైన పడితే
మౌనం కవచంలా ధరించి ముందుకు వెళ్ళాల్సి వస్తోంది ..
కీచకులు, దుస్యాసునులు బాస్సులైన చోట
తలవొంచుకోవాలో , లెంప కాయై తిరగాబడాలో
ఎప్పుడూ డైలమాగానే మారుతోంది ..
తలవంచుకొంటే కోర్కె తీర్చమంటూ  చుట్టూ వేధింపులు
లెంపకయిగా ఎదురుతిరిగితే లింకుల పుకార్ల షికార్లు ..
అరటి ఆకు సామెత ఊరకే పుట్ట లేదు మరి
కాస్త ఇంట్లో వాళ్ళ చేయూత  వుంటే చాలు  కదా
బుసలు కొట్టే నాగుల తోకలు కత్తరించగలం .!!
నమ్మక మనే భరోసా వుంటే చాలు కదా ..
ప్రశ్నల పిడిబాకులమై వారి కుత్తుకలో 
 దిగబడగలం !!

                                      కరణం లుగేంద్ర పిళ్ళై

అంగట్లో అమ్మతనం ..


Jugalbandhi of Sculpture art by M. Ganesh Kumar

ప్రగతి చక్రాల కింద పడి
బంధాలు, అనుబందాలు
ప్రాణాలు కోల్పోతుంటే ..
మానవ సమాజం
ముందుకు పోతోందో వెనుకకు పోతుందో
ఎవ్వరికైనా తెలుస్తోందా.?
అంగట్లో అమ్మతనం
నిర్లజ్జగా అమ్మబడుతోంది ..
గర్భ సంచిని అద్దెకు ఇచ్చి
పొట్ట పోసుకొంటున్న తలలు లెందరో
నిన్నటి దాక ఆడది ఓ ఆటవస్తువే
సుఖాలు తీర్చే ఓ భోగావస్తువే
నేడు అమ్మతనం
అంగడి సరుకవ్వడమే పరాకాష్ట

                 కరణం లుగేంద్ర పిళ్ళై


వేశ్య


Jugalbandhi of Sculpture - Art by Ganesh Kumar M

ఆమె తనువే కల్ప తరువు
విటుడిని ఆకర్షించే  ఆమె నడక
చూపులతోనే ఎంతటివాడైన కాళ్ళబేరానికి రావలసిందే ..
అది నిన్నటి వరకు ..మరి నేడు
తనువంతా కోర్కెల గాట్లు
గాయాల మాయమైన  వొళ్ళు
ఎప్పుడు ఎవ్వరూ పలకరించరు ..
ఒకనాడు సోయగాల మయం ..
నేడు ఎడారి చందం ..
ఒంటరిగా ఎండిన కొమ్మ పై కోకిల అయింది
చిల్లి గవ్వ కోసం చేయి చాపే
వృధ్యాప్యపు భిక్షగాత్తేగా మారింది ..
కలలు కన్నీరు మయం
దురదృష్టం ఏమిటంటే
జాలిగా ఓదార్చుతూ
మనం రాల్చేది కూడా కన్నీరే ....
ఇంకేం ఇవ్వగలం !!

                             కరణం లుగేంద్ర పిళ్ళై