పిశాచమై పట్టి పీడిస్తుంటే .
దేశ ప్రగతి నీరుగారి పోతోంది
ఇంతింత కాదు జగమంతా
అల్లుకుపోతున్న వైనంతో
సమాజం తల్లడిల్లిపోతోంది
ఎవరికీ ఏమీ పట్టని నేడు
అన్న హజారే గళం విప్పాడు
లోక్పాల్ బిల్లుకై ప్రభుత్వ మేడలు వంచాడు
అవినీతిని అంతమొందిచాలంటే
అది ప్రతి ఇంటా మొదలు కావలసిన పవిత్ర యజ్ఞం ..
విలువల పాదులు తీసి
ప్రతి బిడ్డకు గోరు ముద్దలతో
అందించవలసిన పవిత్ర కార్యం ..
యుద్ధం మొదలైంది ..సన్నధమౌదాం !
అంతం కాదిది ఆరంభమే ..
వ్యక్తి మారినప్పుడే వ్యవస్థ మారేది ..
రండి సోదరులార మారి చూపుదము
రాబోయే తరాలకు మార్గదర్శాకులవుదము !!
కరణం లుగేంద్ర పిళ్ళై
No comments:
Post a Comment
Comment on Telgu poem