EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

05/09/2011

ఆఫీసుల్లో అడబతుకు ..!




Art by M. Ganesh Kumar
  చూపులు వళ్ళంతా తడుముతుంటే
తేళ్ళు ,జేర్రెలు ప్రాకుతున్నట్టు వుంటుంది
సూటు బూటు వేసుకున్న మగ మృగాలు
అడవి జంతువులకన్నా క్రూరమైనవి .
చిన్న కష్టానికే మేమున్నామంటూ
ఓదార్చే చేతుల చేష్టల్లో
కోర్కెల కాలనాగుల బుసలు కొడతాయి ..
డబల్ మీనింగ్ డైలాగ్లు డైనమేట్లై
హృదయాన్ని గాయపరుస్తుంటే
గోల చేయడమో , గేలి చేయడమో
వెంటపడి వేటాడటమో చేస్తూనే వుంటారు..
అవసరం వున్నా లేకున్నా మాటలు కలుపుతారు
తడుముతూ స్పర్స తోనే మానసిక వ్యభిచారం చేస్తారు ..
సెల్ ఫోన్ లో నీలి చిత్రాల సందేశాలు
అర్థం చేసుకోలేని అత్తా మామ ..
భాదను మరింత భాధ పెట్టె భర్త సాడిజం తోడవుతుంది ..
ఇంకేం అందరూ పుండుపై కారం రాస్తారు ..
చుట్టూ అందరు వున్నా ఒంటరిగా అడవిలో వున్నటు ఉంటోంది ..
చుట్టలైనా , స్నేహితులైన , కట్టుకున్న వాడిన
చెప్పుకోలేని మౌన సంఘర్షణ మాది ..
మానం కాపాడుకోవలసిన నిందలు పైన పడితే
మౌనం కవచంలా ధరించి ముందుకు వెళ్ళాల్సి వస్తోంది ..
కీచకులు, దుస్యాసునులు బాస్సులైన చోట
తలవొంచుకోవాలో , లెంప కాయై తిరగాబడాలో
ఎప్పుడూ డైలమాగానే మారుతోంది ..
తలవంచుకొంటే కోర్కె తీర్చమంటూ  చుట్టూ వేధింపులు
లెంపకయిగా ఎదురుతిరిగితే లింకుల పుకార్ల షికార్లు ..
అరటి ఆకు సామెత ఊరకే పుట్ట లేదు మరి
కాస్త ఇంట్లో వాళ్ళ చేయూత  వుంటే చాలు  కదా
బుసలు కొట్టే నాగుల తోకలు కత్తరించగలం .!!
నమ్మక మనే భరోసా వుంటే చాలు కదా ..
ప్రశ్నల పిడిబాకులమై వారి కుత్తుకలో 
 దిగబడగలం !!

                                      కరణం లుగేంద్ర పిళ్ళై

1 comment:

  1. chaalaa baagundi neti samaajam loni sthree pade mano vedananu prathibimbisthunnadi.

    mee kavithaku johaarlu.............

    ReplyDelete

Comment on Telgu poem