అమ్మ ఒడిలో ఆడుకున్న బాల్యం
నాన్న భుజాలపై ఊరేగిన బాల్యం
అక్షరాలూ దిద్ది బడిలో ఆడుకున్న బాల్యం
రెక్కలు తొడిగి నింగిన గాలి పటమై ఎగిరిన బాల్యం
చందమామతో స్నేహం చేసి వెన్నల నవ్వులై విరిసిన బాల్యం
నేడు ఓ జ్ఞాపకమేనా ..
కుల మతాలు లేకుండా పంచుకున్న కాకి ఎంగిళ్ళు
ఆడా మగా తేడాలేకుండా గిచ్చుకున్న ఆటల ముంగిళ్ళు
పిల్ల కాల్వల వెంట లేగ దూడలై ఎగిరిన గంతులు
నేడు ఓ తీపి గురుతేనా !
అప్పటి బాల్యం ఓ బంగారు ప్రపంచం ..
నెమరేసుకుంటే చెమర్చిన కళ్ళను అడుగు
జ్ఞాపకమై మెరిసిన ఇరుగు పొరుగును అడుగు
అక్కడే ఆగిపోయింటే ఎంత బాగుండేదని అంటాయి
స్వచమైన మనసుల నడుమ
స్వేచ్చగా మసలిన ముక్కుపచ్చలారని బాల్యం
బతుకు బందీఖానాలో నేడు బిక్కు బిక్కు మంటోంది
మనం కోల్పోయిన బాల్యాన్ని మన పిల్లల కిద్దాం
పిల్లల్ని పుస్తకాల పురుగులు చేయకుండా
అచ్చమైన మనుషులుగా స్వచంగా పెంచుదాం
నేటి యాంత్రిక యుగంలో యంత్రాలుగా పిల్లల్ని చూడకండి !
నేటి పోటీ ప్రపంచంలో పిల్లలపై గుర్రపు పందాలు కాయకండి !
కరణం లుగేంద్ర పిళ్ళై
gadachina madhuramaina baalyam gurthuku vacchindi.
ReplyDeleteneti tharam kolpothunna baalyam patla digulu munchukocchindhi.
కుల మతాలు లేకుండా పంచుకున్న కాకి ఎంగిళ్ళు
ReplyDeleteఆడా మగా తేడాలేకుండా గిచ్చుకున్న ఆటల ముంగిళ్ళు
పిల్ల కాల్వల వెంట లేగ దూడలై ఎగిరిన గంతులు చాలా బాగుంది! అమాయకత్వం ఒక గొప్ప వరం అందుకే బాల్యం అంత ఆనందంగా గడిచిపోతుంది!