కాకి కోయిల పోటీ పడ్డాయి
కోయిల కమ్మని గానంతో
పాడుతుంటే ఆహ్లాదంగా
అందరూ మైమరచారు ..
కాకి గొంతువిప్పి పాడితే
గులక రాళ్ళ శబ్దమని
రాలు విసిరారు ...
కట్ చేస్తే..
పెద్దల పండుగ వచ్చింది
పిండ ప్రదానం చేసిన వారు
ఇంట్లో పూజ చేసిన వారు
చనిపోయిన పెద్దలకు ముందుగా నైవేద్యం పెట్టాలని
ఇంటి వాకిట్లో నిలబడి
కాకుల్నికావు కావు అని అరిచి ఆహ్వానించారు ..
ఇది చూసి కోయిల అంది
నా విలువ నా గొంతుకే
నీ విలువ వారి జీవితానికే !!
No comments:
Post a Comment
Comment on Telgu poem