EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

16/10/2011

నీవే నా ప్రాణమూ !





ఆశల ఆవనిలో
నిటూర్పుల తుపాను ..
ప్రేమల బృందావనంలో
 విరహానల  జ్వాలా ప్రభంజనాలు ..
ఎటు పాలు పోనీ నాకు
జీవితమే ఓ సుడిగుండమైనప్పుడు
ఎగిసి పడే అలగా మారిన నేను
కెరటమై తీరం కోసం వెతుకులాడుతున్నా ..
ఆలంబనగా మారిన నీ పిలుపులో
పోయిన ఆశల చిగుర్లను  తిరిగి చూస్తున్నా.
ఎందుకో తెలియదు నీ మాట కూడా
నన్ను నడిపే దిక్సూచి అవుతోంది ..
ఏమిటో తెలియదు నీ స్పర్శ కూడా
నాలో కొత్త ధైర్యాని నింపుతోంది ..
ఒట్టి పోయిన ఆకాశంలో
నువ్వు ఇంద్ర ధనుస్సు వై విరబూసి...
ఇంకిపోయిన నా లోలోని
జీవన మాధుర్యాన్ని నాలో తిరిగినింపు ..!

2 comments:

  1. చాలా బాగుంది.

    చిన్న చిన్న సవరణలు:

    విరహాల జ్వాలా అనికాకా విరహానలజ్వాలా అంటే మరింత ఉచితంగా ఉంటుంది.
    సుడిగుండమైయినప్పుడు కాదు సుడిగుండమైనప్పుడు.'యి' అనవసరం.
    ఆశల చిగ్గుర్లను కాదు ఆశల చిగుర్లను 'గ్గు' తప్పు.
    అన్వయదోషం తిరిగి నింపినట్టు అంటే, గమనించండి:
    ....
    .... విరబూసినట్టే
    ....
    .... తిరిగి నింపు.
    అంటే సరిగా ఉంటుంది.
    అభినందనలతో,
    శ్యామలరావు

    ReplyDelete
  2. మీరు సూచించిన సవరణలకు కృతజ్ఞతలు .. అక్షర దోషాలు ఎక్కువగా ఇంగ్లీష్ టైపు నుండి తెలుగు వ్రాయడం వల్ల జరుగుతోంది.. ఇకపై శ్రద్ధ తీసుకుంటాను.

    ReplyDelete

Comment on Telgu poem