కూలీకి వెళ్ళలేము.. కాసులు తేలేము
కడుపు నిండా తిని ఎన్నాళ్ళు అయిందో ..!
దొర పిలుపుకు మా కొంప పస్తులుండే
మా బిడ్డలా చదువు అట్టకేక్కే..
తెలంగాణా అంటే మా నేల పై
మాదే పెత్తనం అనుకున్నాం
మా మట్టిపై మాదే విజయం అనుకున్నాం
అది రాకముందే బలసిన నాయకులు
మా బతుకుల మట్టి కొడుతుంటే
సైలెంట్‌గా సెంటిమెంట్ అని సర్దుకు పోతున్నాం !
సమ్మె పిలుపు ఇచ్చిన అయ్య
ఢిల్లీ లో షాపింగ్ చేస్తుండు ..
వారి పిల్లలు విదేశాలలో చదువుతుండ్రు..
మా పేద పిల్లల బతుకులు నేలరాయకండి
మా బతుకుల్లో చీకటి నింపి
మీరు వెలుగుల ఇంద్ర భవనాలలో ఊయలూగకండి..!
తెలంగాణా అంటే మా అమ్మ అనుకుంటున్నాము .
మా విశ్వాసాని ఢిల్లీ నడివీడులో తాకట్టు పెట్టకండి !!
మా విశ్వాసం శాంతిగా విజయం పొందినప్పుడే మాకు పండుగ
మా నాయకులూ నిస్వార్ధంగా నడిచినప్పుడే మాకు పండుగ
Pillai sir, కొన్ని ప్రశ్నలు if you don't mind.
ReplyDelete"సమ్మె పిలుపు ఇచ్చిన అయ్య
ఢిల్లీ లో షాపింగ్ చేస్తుండు"
ఎవడు చెప్పిండుబై?
"వారి పిల్లలు విదేశాలలో చదువుతుండ్రు"
ఆంధ్రోల్ల పిల్లలు అమెరికాల చదువతలేరా?
"మా విశ్వాసాని ఢిల్లీ నడివీడులో తాకట్టు పెట్టకండి"
బెజవాడల తాకట్టు పెట్టేదానికన్న గిదే నయం కదా
"మా విశ్వాసం శాంతిగా విజయం పొందినప్పుడే మాకు పండుగ"
తెలంగాణ వచ్చినంకనే నిజమయిన పండగ.
ఆంధ్రోల్లు వాళ్ళు డిసెంబర్ 10 న "ఉద్యమం" చేసినప్పుడు రాయని సూక్తి ముక్తావళి, పాటించని ధర్మసూత్రాలు మనకు మాత్రమె చెప్తరు. గీ ఆంధ్రోల్ల సవితి ప్రేమకు, దొంగ "సోదర" భావానికి, మొసలి కన్నీళ్ళకు లొంగడానికి మనం హౌల గాల్లం కాదు. మీరు చెప్పెదొందే మా తెలంగాణకి అడ్డు రావొద్దని మీ వాళ్లకి చెప్పండి.
ఆంధ్రోల్లు,తెలంగాణోల్లు అంటూ రెండురకాల జనం లేరు. ఉన్నదంతా తెలుగోల్లు మాత్రమే. కాని పిచ్చితలకెక్కినవాళ్ళకు చుట్టూ ఉన్నవాళ్ళంతా శత్రువుల్లా కనిపిస్తే వింతలేదు. ఉన్న కాస్త తెలుగు చెక్కనూ యేనాడో రాజకీయనాయక భూతాలు అంచులు కొరికి వదిలేసాయి. ఇప్పుడు తెలుగుభూమిని రెండో మూడో ముక్కలు చేయాలని రంకెలు వేస్తున్నాయి. కసాయివాళ్ళను నమ్మే గొర్రెల్లాగా కొందరు వాళ్ళకు తలలూపుతూ వాళ్ళచుట్టూచేరి వాళ్ళ పాదాలదగ్గర వెర్రి వీర నాట్యాలు చేస్తున్నారు. జయచంద్రుడి సైన్యం రాజ్యం ఇలాగు శివమెత్త బట్టే భారతదేశానికి దాస్యం తలకు చుట్టుకుందని వీళ్ళకి చెప్పి లాభంలేదు సుమా! కాలం యేం నిర్ణయిస్తుందో కదా!
ReplyDeleteమీ కేదో తెలంగాణ గురించి తెలిసిన వల్లలా...మట్లాడకండి....మి సొతెదో అడిగినట్టు యెందుకంత హైరాన పడుతున్నరు.....
ReplyDeleteమా చరిత్ర తెలుసా........మ స్వాతంత్రం గురించి తెలుసా....మా నీల్ల గొస తెలుసా...మా కొలువుల గురించి తెలుసా...మా బాదల గురించి తెలుసా......ప్రభుత్వాలె మమ్మలిని పరయి వల్లలా చుడడంతెలుసా .
మమ్మలిని మా నొరు నొక్కి శ్రీలంకలొ తమిలులలా చుస్తున్నరు..
సవతి ప్రేమ చుపిస్థున్నారు..
ఆదర్మొ నాశోస్తు ....దర్మొ విజయోస్తు..
ఇక్కడ ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు. ప్రతి ప్రాంతంలోనూ వారికో చరిత్ర వుంటుంది, సమస్య వుంటుంది అయితే విడి పోతేనే పరిష్కారం అనేది ప్రపంచంలో ఎక్కడ ఇంత వరకూ జరుగలేదు. విడిపోయిన జర్మన్ గోడలు బద్దలు కొట్టుకొని కలిసింది. విడిపోయిన రష్యా దేశాలు ఎలాంటి ప్రభావితం లేకుండా పోయాయి. చమురు అమ్మే ఇస్లామిక్ దేశాలు కలిసి వుంటే అమెరికా పప్పులు ఉడికేవి కావు. అయిదు వేళ్లు చేతిలో సమానంగా వుండవు. అయిన అవి కలిస్తేనే పిడికిలి బలమవుతుంది. అన్నమయినా నోటిలోకి వెళుతుంది. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాము.. అలాగే ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి . ఏమి జరిగినా మనం శత్రువులం మాత్రం కాదు.
ReplyDelete