చెమట చుక్కలు చిందిస్తున్న
ఆమె విశాలమైన నుదురు
వర్షించే ఆకాశంలా వుంది
చెమర్చిన కళ్ళ లోగిళ్ళలో
సునామీలు దాగున్నాయోమో ?
వంట ఇల్లే ఆమె ప్రపంచమై
మూడు దశాబ్దాలు దాటిందనుకుంటా
వండి వార్చి వడ్డించడమే జీవితమై
తనకేమి కావాలో మర్చి పోయింది
ఎదిగిన పిల్లలు రెక్కలొచ్చి తలోదిక్కు వెళితే
వారి పిల్లలకు మళ్ళీ తల్లిగా మారింది ..
లోకం తెలియని మనిషిగా ముద్రించబడి
శోకం మాత్రమె తెలిసిన సీరియల్ నటిగా మారిందేమో
ఒక నిర్వేదం , ఒక నిటూర్పు కూడా కనబడనీయక
పిల్లల ఫోన్ పిలుపుకోసం చకోరమవుతుంది .
పండుగలోస్తే అందర్ని రమ్మని పిలిచి
వారి వారి రుచులలో తాను కలగలసి పోతుంది
ఇవ్వడమే తెలిసిన తనకు ఆస్తులు లేవు కాని
తన జీవితాన్నే అంకితం చేసిన దేవతగా కనిపిస్తోంది.
chaalaa baagundi.
ReplyDeleteNice one andi
ReplyDeleteకవిత బాగుంది. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు గమనించ గలరు. ఎత్తి చూపినందుకు అన్యధా భావించవద్దని మనవి.
ReplyDelete1. ఆమె విశాల నుదురు
విశాల సంస్కృత పదం. నుదురు తెలుగు పదం. కాబట్టి సమాసం చేయగూడదు. విశాలమైన నుదురు అనే అనాలి.
2. మూడు దశాబ్దాలు దాటిదనుకుంటా
..... దాటిందనుకుంటా. చిన్న ముద్రారాక్షసం.
3. తనకు ఏమి కావాలో మర్చి పోయింది
ఉకారానికి అచ్చు పరమైతే తప్పనిసరిగా సంధి చేయాలండీ. తనకు + ఏమి => తనకేమి
4. ఎదిగిన పిల్లలు రెక్కలొచ్చి తలదిక్కు వెళితే
.... తలొక దిక్కు .... చిన్న ముద్రారాక్షసం. తలదిక్కు అంటే తల యొక్క దిక్కు. అంటే తల ఉన్న దిక్కు అని కదా.
5. వారి పిల్లలకు మల్లి తల్లిగా మారింది ..
...... మళ్ళీ తల్లి గా ......... మల్లి అనే ది ఒక పువ్వు. మీరు వ్రాయాలనుకున్నది మళ్ళీ (again) అని కదా.
6. ఒక నిర్వేదన , ఒక నిటూర్పు
ఒక నిర్వేదం, ఒక నిటూర్పు. నిర్వేదన అనే మాట లేదండీ.
7. పిల్లల ఫోన్ పిలుపుకోసం చకొరమవుతుంది .
..... చకోరమవుతుంది
.... చకోరమౌతుంది
ఎలాగైనా ఫరవాలేదు. ముఖ్య విషయం చకొరం కాదు చకోరం.
8. పండుగలోస్తే .....
పండుగలొస్తే... ( అనవుసర దీర్ఘం )
9. .తన జీవితాన్నే అంకితం చేసిన దేవత గా కనిపిస్తోంది.
.......... దేవతగా ...........
Good job... మంచి రివ్యూ
DeleteThanks syamaleeyam gaaru your suggestion are good.. typing lo porapaatlu vastondi.. sarichesaanu
ReplyDelete