బిడ్డలు రెక్కలు వచ్చి వెళ్ళినా..
వయస్సు గుర్తుచేయడానికనేమో..
వచ్చి చేరింది మూడోకాలు...
ఆత్మవిశ్వాసం రూపంలో
బతుకు చెట్టు నుండి
ఆశల ఆకుల్ని
శిశిరం రాల్చేస్తోంది
కాని కాస్త సహనంతో ఉంటే
వసంతం పచ్చని చిగురును వేయిస్తుంది
ఒంటరిగా మిగిలిన ఏకాకికి
ఏదారైనా రహదారే
తలవంచని పనులు చేస్తున్నప్పుడు
తలెత్తుకు బతికే తోడవుతుంది...
గుండె ఆకాశాన్ని
దిగులు మేఘం కమ్మేస్తుంది
అప్పుడప్పుడూ...
తోడుగా నడిచే నీడ చాలదా
కాటిదాకా కబుర్లు చెప్పడానికి
ఎల్లప్పుడూ...
No comments:
Post a Comment
Comment on Telgu poem