తడిగుడ్డతో గొంతుకోసే
కసాయతనం నీకు వంటబట్టినప్పడు
మా వేదన నీకు ఎలా అర్థం అవుతుంది
మెత్తని మాయ మాటలతోనే
గుండెలో కత్తులు దింపే కళలో నిష్ణాతుడవయ్యాక
మా రోదన కూడా నీకు వెస్ట్రన్ మ్యూజిక్ అవుతుంటే
మనిషితోలు కప్పుకున్న రాక్షసుడిగా మారాక
నీకు ఎన్ని నీతి వచనాలు చెప్పినా చాలవు
నీ అహంకారానికి మా సహనం సలాం అన్నంతవరకే
నీ అధికారానికి బానిసలమై మేము గులాం అన్నంతవరకే
ఒక్కసారి తిరగబడితే నీవు తట్టుకోలేవు
ఆ ఆలోచనే నీకు నిదురలేని రాత్రులను బహుమతిగా ఇస్తుంది.
ఇక మేము మేల్కోంటే నీవు ఏమవుతావురా
మట్టిలో మట్టిగా కలసిపోవడం తప్ప
adbhutamgaa undi. Ee madhya mee kavitalu choodatam ledu. maralaa ippude vacchaanu. kavitaa sanputi yeppudu vesthaarandee!
ReplyDeleteమీ కామెంట్స్ కు ధన్యవాదములు. 1992 లోనే చైతన్య కెరటాలు సంపుటి తేవడం జరిగింది.ఆ తరువాత తేలేదు. మీలాంటి స్నేహితుల ప్రోత్సాహంతో ఈ సంవత్సరం తేవాలని అనుకుంటున్నాను.
ReplyDeletethis is not poetry at all.
ReplyDeleteఉహలే కవిత్వం అనుకున్నప్పుడు వాస్తవం కవిత్వం అనిపించదు
ReplyDeleteఏది కవిత్వం , ఏది కాదు అనేది.. ఎలా చెప్పగలరు. పద్య కవితే కవిత అనుకునే రోజులలో వచన కవిత గురించి ఇలాగే మాట్లాడారు. సామాజిక స్పృహ కలిగిన కవితలు వ్రాస్తే ఇలా అనే వారు ఉన్నారేమో.. నాకు తెలిసినది . నియమాలు లేనిదే వచన కవిత. కాస్త వర్ణన, ఊహలు లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేసా అంతే..ఏది ఏమైనా ఇది కవితే కాదు అన్న వారు తమ పేరే దాచిపెట్టినందులకు ఆలోచించాలి మరి
ReplyDelete