ఆకు రాలిన
చప్పుడు
వసరాలో నులకమంచంపై
భీష్ముడిలా
చావుకోసం
ఎదురుచూస్తూ
అలసిపోతున్న
గాజు కళ్ళ దృశ్యం
ఉచ్వాస
నిఛ్వాసల ఊగిసలాట
తులసి తీర్థం
కూడా పోసే ఓపికలేక
ఇంకా
ఊపిరిపోదేమని ప్రశ్నించుకుంటూ
కాసులు
ఖర్చవుతున్నాయని కీచులాటల దృశ్యం
ఆస్తి
పంపకాలకోసం
కొన ఊపిరి
ఆగకమునుపే పేచీలు
రెక్కలు
ముక్కలు చేసుకున్న జీవితం
అంతిమదశలో
గుండె ముక్కలు చేసుకుంటున్న దృశ్యం
ఎలాగోలా దహన
సంస్కారం అయింది
ఆభిమానమున్నవారి
భుజాలపై సాగిన శవయాత్ర
ఎంత గొప్పగా
చేశారు కన్నవారి అంత్యక్రియలు
పదోరోజు కర్మ
క్రియలకు పుల్ పేజీ యాడ్ దృశ్యం
11.10.12
ప్చ్...విచారకరమైనా, సత్యం చెప్పారు.
ReplyDelete