ఏ తీరాలకు ఈ
పయనం
అంతే తెలియని
గమనం
అలసిపోతున్నా
ఆగని వైనం
పురోగమిస్తున్నమో..
తిరోగమిస్తున్నమో
ఎవరైనా
చెప్పగలమా..
ఆరడుగలు
చాలవనా
వేల ఎకరాల భూకబ్జాలు
చేయాలా..
నాలుగు
వేళ్ళు నోటిలోకి చాలవా
కోట్లకు
కోట్లు మింగేసే తీరాలా
పురోగమిస్తున్నమో..
తిరోగమిస్తున్నమో
ఎవరైనా
చెప్పగలమా..
నమ్మిన
వారిని ముంచేసే
నయవంచకు
తెలివనుకునే తీరును
నాయకత్వమనుకునే
భ్రమను చూసి
పురోగమిస్తున్నమో..
తిరోగమిస్తున్నమో
ఎవరైనా
చెప్పగలమా..
ఆశ నిరాశల
వలయంలో
నిత్యం
సంఘర్షణ..
మనసులోని
ఆలోచనలకూ
తప్పని
పరస్పరం వైరుధ్యాల ఘర్షణ
మనసు
ప్రశాంతత లేని మానవ సమాజంలో
పురోగమిస్తున్నమో..
తిరోగమిస్తున్నమో
ఎవరైనా
చెప్పగలమా.. 13.10.12
-కరణం లుగేంద్ర పిళ్ళై
అలా చెప్పగలిగితే మేధావులమైపోతామండి. మంచి కవిత!
ReplyDeleteమేథావులు సైతం మేతావులు అయితే . . . మనం మాత్రం ఏం చేయగలం. . మోనంగా మ్రోయడం తప్ప. . .
ReplyDelete