పరమాణువులు కలిస్తేనే అణువని
అణువులు కలిస్తేనే ఏదైనా
రూపమని
నేర్చుకున్నాం ..మరి ఇదేమిటి
మనలో మనమే విడిపోతున్నాం
గమ్యం చేరేంతలోనే ఏమైంది
ఎవరి దారి వారు చూసుకుంటున్నాం
మనం వెలుతున్నది ముందుకా
వెనక్కా
ఓ సారి చూసుకుందాం
మానవతా రెమ్మలు విరుచుకుని
మమతల కొమ్మలు నరుక్కొని ఎటు
పోతున్నాం
కీలెరిగి వాత పెట్టమన్నట్టు
రోగం ఏదో తెలుసుకొని
మందెయ్యాలిగా
మరి ఇదేమిటి రోగమొకటయితే మందొకటి వేస్తున్నాం
కులాల వాటాలు లెక్క కట్టి
మ్యూజిక్ ఛైర్ ఆట ఆడుకుంటున్నాం
పాలన గాలికొదిలేసి ప్రగల్బాలు
అవసరమా
చివరికి మిగేలేది శూన్యమని
తెలియదా
ఇంకా ఎందుకొరకు యాతనపడుతున్నాం
స్వేచ్చ అంటే ప్రక్కవాడి
ముక్కుకు
తగలకుండా ఇష్టప్రకారం నడవమనీ
వాక్ స్వాతంత్రం అంటే భావాలను
ఏ సంకోచం లేకుండా
వ్యక్తీకరించమని
నేర్చుకున్నాం మరి ఇదేమిటి
నోటి మాటను తూటలా ఎక్కుపెడుతూ
సాటివారిని భయభ్రాంతులకు
గురిచేస్తున్నాం
ఎవరు ఏమి చేయాలో కూడదో మనమే
నిర్దేషిస్తున్నాం
గమ్యం మరచి , లక్ష్యం విడచి
మనలోనే మనం వేరుపడి
మనం ఎటుపోతున్నాం.. ముందుకా
వెనక్కా.. 31.10.12
మంచిప్రశ్న....అలోచించాల్సిందే అవసరం ఏ మేరకో;;
ReplyDelete