మన అడుగుజాడ గురుజాడ
మన వెలుగుజాడ గురుజాడ
కన్యాశుల్కం పాత్రల రచనల అక్షర శిల్పి
తుప్పు పట్టిన చాంధస భావాల నడ్డి విరిచి
నాటకమైనా , కవితైనా ,కథైనా
వాడుక భాషకు మరల్చి
ప్రజా భాహూల్యానికి అందించిన సంస్కర్త ..
దేశమంటే మట్టి కాదని
దేశమంటే మనుషలని ప్రభోదించిన మానవతావాది
ముత్యాల సరాలు ..రత్నాలై మెరుస్తుంటే
తెలుగు తల్లి పులకించి పోయింది
సాహిత్యానికి సమాజ స్పృహే గీటు రాయన్న వాడు
"గురు " జాడలు మరిచితే మన జాతిని మరిచినట్టే..
తెలుగు జాతి పితకు అక్షరాంజలి !!
గురుజాడ 150 జయంతి సందర్భంగా చంద్రునికో నూలు పోగు ..
-కరణం లుగేంద్ర పిళ్ళై
No comments:
Post a Comment
Comment on Telgu poem