ఆకాశంలో నీలిమేఘాలు
నీ ప్రేమ సందేశాన్ని
తీసుకు వచ్చాయేమో
నీ రూపు ధరించి నీలాగే నవ్వుతూ
నేను ఎటు వెళితే అటు వస్తున్నాయి ..
నీవు కాళిదాసు మేఘ సందేశానివే సుమా
మండుటెండ కూడా మంచులా కురుస్తూ ..
చెమటై తడిచిన శరీరాన్ని చల్లబరుస్తోంది ..
నీ తలపు ఒక్కటి వుంటే చాలు
దారి చూపని చిక్కటి చీకటి చుట్టూ వున్నా
నీ నవ్వులు శరత్చంద్రికలు కురిపిస్తాయి ..
నీ పిలుపు మళ్లీ మళ్లీ వినిపిస్తూవుంటే
నా చెవులకు అది కర్ణాటక సంగీతమే కదా
నీ అందేలా సవ్వడి దగ్గర అవుతుంటే
నీ గాజుల గల గలలు ,
నాలో ఆలోచనలను తట్టిలేపుతున్నాయి
కన్నులు నావయినా దాని చూపు నీవే కదా
కలం నేనైనా పొంగివచ్చే కవిత నీవే కదా
జీవితం నాదైన దానికి అర్థం పరమార్థం నీ ప్రేమ కదా.
స్వాగాతమా నా స్వగతమా..
నీకే అంకితం ఈ నా జీవితం!
సహచరీ , నా శ్వాసమయీ
నీవే నా ప్రణయ నాయకవు!!కరణం లుగేంద్ర పిళ్ళై
baagundi!
ReplyDelete