వర్షపు చినుకుకై
కోయిల ఏడుస్తుంటే
మనకు అది పాటలా శ్రావ్యంగా వుంటుంది ..
పేదల ఆకలి ఏడుపులు కూడా
ఉన్నోల్లకు కాలక్షేపంగా మారిందేమో
గోదాముల్లో బియ్యం కుళ్ళి పోతున్నా
పేదలకు పెట్టాలన్న ఆలోచన రాదు
ధరలు తగ్గించాలన్న యోచనే రాదు
ఇది ప్రజల ప్రభుత్వం అంటారు ..
కాని ప్రజల కోసం పని చేసే వారే లేదు
- కరణం లుగేంద్ర పిళ్ళై
మీరన్నది నిజమే. బియ్యము ఒక్క రూపాయకు ఇస్తామంటే అది కూడా తప్పు అంటున్నారు. గోదాముల్లో కుళ్ళిపోయేకన్నా ఇలా ఇవ్వటం మంచిదే కదా !
ReplyDelete