మరుగుజ్జులాంటి నన్ను చూసి
నీలాకాశం నాతొ అంది
నన్ను అందుకోవా అని...
చీకటిలా కుమిలిపోతున్న నన్ను
జాబిల్లి తనలా వెలగమంది
వెక్కిరింత అనుకోమని నా అహం అంటోది
అది కూడా వెన్ను తట్టడమని హృదయం అంటోంది
విత్తనమై రాలిపడి మట్టిని చీల్చుకుని
గడ్డిలా మొలిచిన నేను
వృక్షంలా ఎదగాలని వుంది ..
చినుకుగా నేలకు చేరిన నేను
పిల్లకాల్వలా పరుగులెత్తి
ప్రవాహమై సంద్రాన్నీ చేరాలని వుంది...
గాయమైన ప్రతిసారి గమ్యం గురుతుకు వస్తుంది
పోతుంది అనుకున్న ప్రాణం సంకల్పమై నిలుస్తుంది ..
నాకు ఆకాశమే హద్దు ..
ఊపిరిని నిచ్చెనగా చేసుకొని
ఆహ్వానించిన ఆకాశం అంత ఎత్తు ఎదిగి
జాబ్బిల్లిగా విరబూస్తాను ...!
నేలకు రాలడమే కాదు
ఆవిరిగా పైకి ఎగబ్రాకడం తెలుసనీ నిరూపిస్తాను.!!
No comments:
Post a Comment
Comment on Telgu poem