ఎంతసేపు వేచి చూసినా
సూర్యోదయం కావడం లేదు
బహుళ జాతి కంపెనీకి తాక్కట్టు పెట్టారేమో ?
ఎడారిలా బతుకు మారింది
కన్నీరు ఎంత తాగినా దాహమే
నీటి చుక్క జాడ లేదు
మినరల్ దొరలు బోరులు వేసి తోడేసారేమో?
నానాటికి నేల తరిగి పోతోంది
ఆరు అడుగులు కూడా మిగలదాయే
అపార్ట్మెంట్లకు మాత్రం కొదవలేదు
వామనుడి అడుగులు బడా బాబులు నేర్చారేమో ?
దుమ్ము కంటిలో నిండి పోతోంది
ఊపిరి తితులు ఒట్టి పోతున్నై
కాలుష్యం కాలనాగు కాటుకు
జీవ కారుణ్యాన్ని కాటిన్యం కమ్మిందేమో ?
కళ్ళు నిప్పులు కక్కు తున్నాయి
నిప్పుకు కూడా చెదలు అంటిస్తున్నారు
గుండె మంటలు చలిమంటలా
బడుగు బతుకులపై పిడుగులు పగ బట్టయేమో !!
-కరణం లుగేంద్ర పిళ్ళై
No comments:
Post a Comment
Comment on Telgu poem