కమ్ముకున్న కటిక చీకట్లలో బందీగా
ముంచుకొస్తున్న ముప్పుకు బానిసగా
ఎన్నాళ్ళు ఎలా బ్రతకడం ?
నిరంతరం చస్తూ బతికే బతుకు ఒక బతుకేనా ?మనిషి మనిషిలా బతకలేకుంటే చావడం న్యాయమా ?
చావాలసింది మనిషికాదు పిరికితత్వం ...
మొలకేత్తవలసినది ధీరత్వం !!
సూర్యున్ని చూడు తనలో వాడి వీడి తగ్గినప్పుడు
సంధ్య పోత్తిల్లకేల్లి విశ్రమిస్తూ
తూరుపు సింధూరమై ఉదయించయటం లేదా ?
నీకేమైంది మిత్రమా ! ఏమిటి వెర్రితనం
ఉరి తాడుకు వేలాడితే పిరికితనం కాక మరేమిటి ?
ఒక అల్లూరి , ఒక సుభాష్ చంద్ర బోష్ నీలోనూ ఉన్నారే ..
ఒక బుద్ధుడు ఒక మహాత్మా నీవు కాలేవా?
ఊపిరితో ఉంటేనే బతుకు పండుగ అవుతుంది ..
ఒట్టి మనిషివే అయినా మనీషీగా మారగలవు
పారిపోవడం కాదు పోరాడటం నేర్చుకుంటే
అగ్ని పర్వతం చీల్చుకొని లావాలా కదలగలవు
చీకటి రాజ్యాన కాంతి పున్జమై నడిచి చూడు
వెన్నెల వెలుగులు సాటివారి బతుకుల్లో పూయించగలవు ..
మనిషి మౌనం కాదు ప్రశ్నించే ఓ చైతన్యం
మనిషి అంటే బానిసలా వంగి సలాం చేసే గులాం కాదు
విల్లులా వంగినా శరంలా దూసుకుపోయే గాండీవం !!!
- కరణం లుగేంద్ర పిళ్ళై
No comments:
Post a Comment
Comment on Telgu poem