EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

26/08/2011

కార్గిల్ కన్నీటికి విలువేముంది..


నేను కన్న కలల రూపం
నా ముందే ఎదుగుతోన్నపుడు
ఎన్ సి సి లో వాడు చేరుతానంటే 
దేశం గర్వించే వాడు కావాలనుకున్నా
జైహింద్ అంటూ వాడు వేసే  అడుగుల సవ్వడిలో 
నా భారత మాతకు రక్షణ కల్పిస్తాడనుకున్నా..
కార్గిల్ యుద్దంలో పోరాడి నేలకోరిగితే
వాడి కాళ్ళకు మొక్కాలనిపిచింది...
జోహార్ అని అందరూ అంటుంటే  కన్నీరు మరచిపోయా
నేడు మన దేశంలోనే అవినీతి నాయకులు వుంటే
కార్గిల్ కన్నీటికి విలువేముంది..
యుద్ద వీరుల త్యాగాలకు పలితమేముంటుంది ..
స్వాతంత్రానికి అర్థమేముంది..
అందుకే మరో పోరుకు సిద్దమవుదాము..
రండి నా సహచారులారా ..
అవినీతి పై యుద్ధం ప్రకటిద్దాం ...
మరో స్వతంత్రం కోసం చేయి చేయీ కలుపుదాం !!
ఇప్పుడు నేను యుద్ద వీరుడనే అవుతాను !!

                                                  కరణం లుగేంద్ర పిళ్ళై





1 comment:

  1. మీ కవితలు అన్నీ చాలా బాగున్నాయి. అభినందనలు.చదువరులను ఆలొచింపజేసే పదునైన బాష,భావావేశం ఉన్నాయి.మరిన్ని వ్రాయండి.

    ReplyDelete

Comment on Telgu poem