ఎక్కడ ఉన్నవో ...ఎలా ఉన్నవో
నీ ఆలోచనలతోనే ఉక్కిరిబిక్కిరిఅవుతున్నా .....
ఓ నా ప్రియ సఖీ ..
మరపురాని నీ తలపుల జడివానలో
తడిచి ముద్దవుతున్నా .....
ఏ అలికిడి విన్నా నీవేననే అలజడిలోనే
నిత్యం నీకోసం ఎదురుచూస్తున్నా ....
తరులైనా.. గిరులైనా , పారేజలపాతాలైనా
నీ ప్రతిరూపాన్ని చూస్తూ తరిచిపోతున్నా ..
నీడలా వెంటాడే నీ జ్ఞాపకాలు
ఉచ్వాస నిచ్స్వాసలవుతున్నాయి ...
తోడులా వెంటుండే నీ గురుతులు
చీకటిలో వెన్నెల కాంతులవుతున్నాయి
సుదూరాల తీరాలు దాటి చెంత చేరవా...
ఊహల దివినుండి వాస్తవమవ్వవా
No comments:
Post a Comment
Comment on Telgu poem