EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

24/08/2011

మాకూ సెలవు కావాలి !


నింగికి వేసాము
బతుకు లంగరు 
వర్షపు చుక్క 
నేలరాలలని !

నేలతల్లి గుండెను 
చీల్చుకు తలపైకేత్తిన 
విత్తు శిశువుకు
మొగ్గలోనే నూరేళ్ళు !
పచ్చని పొలాలు లేవని
పండినా తగిన రేటు లేదని
గుమ్మలకే వేలాడుతున్నాము
శవాలమై
దహన ఖర్చులకా
ఎక్ష్స గ్రేసియాలు ?


క్రాప్ హాలిడే అంటే
కూడదంటారు
మరి అందించే చేయూత లేదే ?
మాకూ సెలవు కావాలి !




బొంకనేర్చిన వారొకరు
బొక్కేసేవారోకరు
కొంగజపం చేసే నేతలకు
నేతన్నల గోడు తెలుస్తోందా?


కడుపు నింపుతున్న వాడినే
కొల్లగొట్టే నీతి  ...
పాలకులారా
చేతులెత్తి వేడుకొంటున్నాము
మమ్మల్ల్ని రైతులుగా చూడండి
ఓటరుగా కాదు ...

- కరణం లుగేంద్ర పిళ్ళై











1 comment:

  1. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే , ఆబోతుల కొట్లాటలో లేగదూడలు నలిగిపోతున్నట్లు. ఇక బడుగుల బతుకు కష్టాల గురించి పట్టించుకునేదెవరు ?

    ReplyDelete

Comment on Telgu poem